Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్‌లో 8 రైళ్లు రద్దు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-19 02:01 GMT

సంక్రాంతికి ఊరెళ్లాలనుకునే రైల్వే ప్రయాణికులకు ఓ చేదువార్త. హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య పనుల కారణంగా 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాజీపేట-హసన్‌పర్తి, బళ్లార్ష-కాజీపేట, కరీంనగర్‌-సిర్పూర్‌, సిర్పూర్‌-కరీంనగర్‌ రైళ్లు డిసెంబరు 19(ఈరోజు) నుంచి జనవరి 13 వరకు రద్దు అవుతాయని తెలిపింది. అదే విధంగా బోధన్‌-కరీంనగర్‌ రైలు డిసెంబరు 20(రేపటి) నుంచి జనవరి 14 వరకు, కరీంనగర్‌-బోధన్‌ రైలు డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ రైళ్లు జనవరి 2 నుంచి 13వ తేదీ వరకు రైళ్లు రద్దు కానున్నాయి. మొత్తంగా 12 రోజుల నుంచి గరిష్ఠంగా 26 రోజులపాటు ఈ రైళ్లు తిరగవని South Central Railway ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉండగా.. రేపటినుంచి కాచిగూడ నుంచి మన్మాడ్‌కు అజంతా ఎక్స్‌ప్రెస్‌(17064) ప్రారంభమవుతుంది. బుధవారం సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రారంభమై మల్కాజిగిరి, కామారెడ్డి, నిజామాబాద్‌, నాందేడ్‌, పర్బణి, ఔరంగాబాద్‌, నాగర్‌సోల్‌ మీదుగా ఆ తర్వాతి రోజు(గురువారం) ఉదయం 8.05 గంటలకు మన్మాడ్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. మన్మాడ్‌ నుంచి కాచిగూడకు వచ్చే అజంతా ఎక్స్‌ప్రెస్‌(17063) అదే రోజు రాత్రి 8.50 గంటలకు అక్కడ బయలుదేరి మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 9.25 గంటలకు కాచిగూడకు వస్తుంది. 




Tags:    

Similar News