Indigo Flight : ఇండిగో విమానంలో ఇచ్చిన శాండ్‌విచ్‌లో స్క్రూ..తామేమి చేయలేమన్న ఎయిర్‌లైన్స్

Update: 2024-02-14 04:10 GMT

(Indigo Flight) అన్నం తినేటప్పుడు అందులో చిన్న రాయి వస్తేనే మనం చిరాక్ గా ఫీల్ అవుతాం. అలాంటిది తినే దాంట్లో పెద్ద స్క్రూనే వచ్చింది ఓ వ్యక్తికి. ఇండిగో విమానంలో తనకు ఇచ్చిన ఓ శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ కనిపించిందని ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాని తను విమానంలో ఆ శాండ్‌విచ్‌ తినలేదని తెలిపాడు. విమానం దిగాక తాను ఈ విషయాన్ని గుర్తించినందు వల్ల..తనకు ఫిర్యాదు చేసే హక్కు లేదని ఎయిర్‌లైన్స్ అన్నట్టు వివరించాడు. ఈ పరిస్థితుల్లో తాను ఏం చేయాలో చెప్పండని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను కోరాడు. అయితే ఈ ఘటన ఫిబ్రవరి 1న ఆ ప్యాసెంజర్ బెంగళూరు నుంచి చెన్నై వెళుతుండగా జరిగింది.




 


కాగా ఈ పోస్ట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కొందరేమో ఐరన్ లెవల్స్ పెంచడానికేమో అని సరదాగా కామెంట్ చేస్తుంటే..మరికొందరు కంపెనీ సీఈఓకు నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు. ఇంకొందరూ ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయాలని సలహాలు ఇచ్చారు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించాలని మరికొందరు సూచించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. ప్యాసింజర్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. అయితే, ఘటనకు సంబంధించి ప్రయాణికుడు సకాలంలో ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చింది. ప్యాసెంజర్లకు సరైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇండిగో స్పష్టం చేసింది. 




 




Tags:    

Similar News