2000 Note: ఇవాళే లాస్ట్.. మళ్లీ చూద్దాం అన్నా కనిపించదు

By :  Bharath
Update: 2023-09-30 02:21 GMT

రేపటి నుంచి రూ.2వేల నోటు కాగితంతో సమానమే. ఆర్బీఐ 20వేల నోటును ఉపసంహరించుకున్న తర్వాత.. వాటిని బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి గడువు విధించింది. ఆర్బీఐ విధించిన గడువు నేటితో (సెప్టెంబర్ 30) ముగియనుంది. దీంతో రేపటి నుంచి 2వేల నోటుకు ఏ విలువ ఉండదు. ఇప్పటికి దాదాపు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. కాగా గడువు పెంచుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ.. గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 2వేల నోటును కొందరు లావాదేవీల్లో, మరికొందరు నేరుగా బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయగా.. అలా మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్​ అయ్యాయి. ఇంకా రూ.2,400 వేల కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ వెనక్కి రాలేదు. 2016, నవంబర్ కు ముందు దేశంలో పెద్ద నోట్లుగా రూ,500, రూ.1000 నోట్లు చలామణిలో ఉండేవి. అయితే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లును ఉపసంహరించుకుని.. రూ.2వేల నోటును తీసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఆ నోటు కూడా రద్దు చేయడంతో దేశంలో రూ.500 నోటే పెద్ద నోటుగా చలామణీలో ఉంది.

Tags:    

Similar News