Shehbaz Sharif : పాకిస్తాన్ ప్రధానిగా.. రెండోసారి ఆయనే ఎన్నికయ్యారు

Byline :  Bharath
Update: 2024-03-03 12:38 GMT

(Shehbaz Sharif) పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక్యయారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అగ్రనేత షరీఫ్.. సంకీర్ణ ప్రభుత్వం తరపున బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా పాక్ ప్రధానిగా షరీఫ్ ఎన్నికవడం ఇది రెండోసారి. ఆయనకు పోటీగా పీటీఐ అభ్యర్థి ఆయూబ్ ఖాన్ నిలిచినా ఫలితం లేకుండా పోయింది. నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ లో జరిగిన ఓటింగ్ లో షరీఫ్ మెజారిటీ సాధించడంతో ప్రధానిగా ఎన్నికయ్యారు. కాగా షెహబాజ్ షరీఫ్ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సోదరుడు. 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనమైన తర్వాత.. షెహబాజ్ షరీఫ్ మొదటిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

అసెంబ్లీలో 169 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటి.. 201 ఓట్లు సాధించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ మద్దతు గల ఒమర్ అయూబ్ 92 ఓట్లకే పరిమితమయ్యారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 265 స్థానాలకు గానూ.. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93, పీఎంఎల్ఎన్ 75, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 53, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ 17 సీట్లు వచ్చాయి.      




Tags:    

Similar News