యూట్యూబ్‌ చూసి భార్యకు డెలివరీ..ఆ తర్వాత ఏమైందంటే

Update: 2023-08-24 03:08 GMT

భార్య ప్రెగ్నెంట్ కావడంతో సంబురపడ్డాడు. ఆమెకు సేంద్రియ విధానంలో పండించిన ఆహారాన్నే అందించేవాడు. వైద్యులు ఇచ్చే మందులు అస్సలు వాడలేదు. నిండు గర్భిణీ అయినా డాక్టర్‎ను సంప్రదించలేదు. ఆమెకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదు. నార్మల్ డెలివరీ కావాలని తనకు తెలిసిన సహజ పద్ధతులను ఫాలో అయ్యాడు. డెలివరీని కూడా యూట్యూబ్ చూసి తానే చేశాడు. ఆఖరికి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ ఇల్లాలి మరణానికి కారణమయ్యాడు ఓ భర్త. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.




 


పోచంపల్లిలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్‌తో పెళ్లి జరిగింది. మాదేశ్‌ ఓ రైతు. ఆయన సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నాడు. ఈమధ్యనే భార్య లోకనాయకి ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే సేంద్రియ విధానాలను అనుసరించే మాదేశా ఆ పద్ధతిలనే ఫాలో అయ్యి భార్యకు మందులు వాడకుండా నార్మల్ డెలివరీ జరగాలని భావించాడు. అందుకే భార్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎలాంటి వైద్యపరీక్షలు చేయించలేదు. ఆస్పత్రి గుమ్మం కూడా తొక్కలేదు. స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని చెప్పినా, మాదేశ్‌ వారిని లెక్కచేయలేదు. ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతోపాటు పౌష్టికాహారాన్నీ కూడా మొండిగా నిరాకరించాడు. తనే ఆమెకు గింజలు, ఆకుకూరలు ఆహారంగా అందించేవాడు.

ఈ సమయంలోనే ఈ ఆగస్టు 22న భార్య లోకనాయకికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. అప్పుడు కూడా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా మాదేశ్‌ యూట్యూబ్‌ చూస్తూ ఆమెకు డెలివరీ చేశాడు. సరైన రీతిలో వైద్యం అందకపోవడం వల్ల భార్య మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ప్రమాదమని భావించి ఇక తప్పదనుకుని భార్యను కున్నియార్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే లోకనాయకి చనిపోయింది. పోలీసులు ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం పోచంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ కంప్లైంట్ మేరకు భర్తపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపైన జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు.




 




 



Tags:    

Similar News