బైకుపై వికృత చేష్టలు..ఇద్దరు కుర్రాళ్ల లిప్ కిస్సులు

Update: 2023-06-02 03:51 GMT

సోషల్ మీడియా పుణ్యమా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న వైజాగ్‎లో లవర్స్ బైకుపైనే రొమాన్స్ చేస్తూ న్యూసెన్స్ చేశారు. నిన్న హర్యానాలో రోడ్డుపైన కొంత మంది కుర్రాళ్లు కారుపైకి ఎక్కి మద్యం తాగుతూ కుస్తీలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు పాపం ఎవరూ చూడటం లేదని స్కూటీ మీద వెళ్తూనే లిప్పు కిస్సులు పెట్టుకుంటూ కెమెరాకు అడ్డంగా బుక్కయ్యారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో షేర్ కావడంతో పైత్యం బాగా ముదిరిందంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. లైకుల కోసం ఇంతలా దిగజారాలా అంటూ యువకులను తిట్టిపోస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ స్కూటీపైన ముగ్గురు కుర్రాళ్లు వేగంగా రోడ్డుపైన ప్రయాణిస్తున్నారు. ఇంతలో వారేమైనా ఛాలెంజ్ చేసుకున్నారో లేదా మరే ఉద్దేశమైనా ఉందో ఏమో తెలియదు కానీ స్కూటీ వెనకాల కూర్చున్న ఇద్దరు కుర్రాళ్లు మాత్రం తమను ఎవరూ చూడటం లేదని రెచ్చిపోయారు. ఒకరికి ఒకరు ఘాటుగా లిప్ కిస్సులు ఇచ్చుకుంటూ రచ్చ రచ్చ చేశారు. రోడ్డుపైన కుర్రాళ్లు ఇలా వికృత చేష్టలకు పాల్పడటంతో అటుగా కారులో వస్తున్న వారు ఈ దృష్యాలను తమ ఫోన్‎లో రికార్డ్ చేశారు. ఆ వీడియోను కాస్త నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో షేర్ చేసిన నిమిషాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ వీడియోను సుమారు 2 లక్షల మంది చూశారు. ఇదేం పైత్యంరా బాబోయ్ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. కుర్రాళ్లు రోడ్డుపైన ఇలా అసభ్యకరమైన పనులతో న్యూసెన్స్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు వీరిని పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు.







Tags:    

Similar News