Punjab: ఫ్రిజ్ పేలి ఆరుగురు మృతి.. వాళ్లలో ముగ్గురు చిన్నారులు

By :  Bharath
Update: 2023-10-09 16:07 GMT

పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఇంట్లో అందరూ టీవీ చూస్తుండగా ఫ్రిజ్ కంప్రెషర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు సహా మరో ఇద్దరు కుటుంబీకులు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన మరొకరు చికిత్స పొందుతూ.. ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పంజాబ్ ఫోరెన్సిక్ టీమ్ క్లూస్ వెతుకుతుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు యశ్‌పాల్‌ గాయ్‌ (70), ఆయన కొడుకు ఇంద్రపాల్‌ (41), కోడలు రుచి గాయ్‌ (40) వారి 14 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలు మానస, దియా, అక్షయ్‌ గా పోలీసులు తేల్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇంద్రపాల్.. జలంధర్ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Tags:    

Similar News