ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నామంటే..అందులోకి ఖచ్చితంగా అల్లం, వెల్లుల్లి కావాల్సిందే. అవి లేనిదే కర్రీకి అసలు టెస్ట్ రాదు. అలాంటింది ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఘాటెక్కాయి. ఆకాశమే హద్దుగా చేసుకొని కిందకు దిగనంటే దిగనంటున్నాయి. ఒకప్పుడు ఉల్లిగడ్డ, టమాట ధరల్లా..ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ధరలు అమాంతం పైకి వెళ్లాయి. ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో వెల్లుల్లి ధర కిలో రూ. 500 మార్క్ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది.
సాధారణంగా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటాం. అది కూడా తెలిదా అనుకుంటారెమో..షాప్స్ లోనో, ఇంట్లోలోనో, ఆఫీసుల్లోనో విలువైన వస్తువులు పోకుండా పెట్టుకుంటాం కదా. కాని ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో వెల్లుల్లి ధర పెరగడంతో...ఏకంగా పొలాల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేసారు రైతులు. ఇప్పుడు ఎల్లిగడ్డలు బహిరంగ మార్కెట్ లో కిలో 500 రూపాయలకు పెరిగింది. దీంతో కొందరు దుండగులు వాటిని పంట పొలాల నుంచే కాజేస్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడానికి పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో వెల్లుల్లి ఎత్తుకెళ్లిన ఘటనలు వెలుగులోకి రావడంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయని రైతులు చెబుతున్నారు.
అయితే, గత 60 ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని రైతులు తెలిపారు. కాగా వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులు కావడం మరో విశేషం. అయితే కొందరు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయంతో గడుపుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తారు. జిల్లాలో ఉద్యాన పంటల మొత్తం విస్తీర్ణం లక్షా 30 హెక్టార్లు ఉంది. 2023లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి ఆసక్తి చూపలేదు.. సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు తెలిపారు.