సోషల్ మీడియాలో స్మృతి చాలా యాక్టివ్ గా ఉంటారు. తరుచుగా నెటిజన్స్ తో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా అడిగినే ఓ ప్రశ్నకు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. మీరేమైనా అడగాలనుకుంటే డైరెక్ట్ గా నన్నే అడగండి...ఇతరులను ఇందులోకి లాగొద్దు అంటూ కొట్టినట్టు చెప్పారు.
అసలు ఏమైందంటే సోషల్ మీడియాలో ఒకరు స్మృతి ఇరానీని మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని అడిగారు. దానికి ఆమె...మోనా నాకన్నా 13 ఏళ్ళు పెద్దది. అలాంటప్పుడు తను నా ఫ్రెండ్ ఎలా అవుతుంది. రాజకీయనాయకురాలు కూడా కాదు. కాబట్టి ఆమెను ఇందులోకి లాగొద్దు అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. ఒక అమాయకురాలి గౌరవానికి భంగం వాటిల్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీకు ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి, కావాలంటే పోరాడండి అని కూడా చెప్పారు.
టీవీ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన స్మృతి ఇరానీ...రాజకీయ నాయకురాలిగా ఎదిగి ప్రస్తుంత కేంద్రమంత్రి పదవి హోదాలో ఉన్నారు. 2001లో స్మృతి జుబిన్ ఇరానీనీ పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు అంతకు ముందే మోనా అనే ఆమెతో వివాహం అయి విడిపోయారు. స్మృతి, జుబిన్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అలాగే ఈ ప్రశ్నతో పాటూ తనకు ఇస్టమైన ఆహఆరం, ప్రదేశాలు, లైఫ్ లగురించికూడా చాలా విషయాలు పంచుకున్నారు.