Sonia Gandhi : కీలక భేటీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

Byline :  Aruna
Update: 2023-09-04 10:42 GMT

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, సీసీపీ చైర్మన్ సోనియా గాంధీ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీతో భేటీ అయ్యేందుకు ఆమె తాజాగా నిర్ణయించారు. ఈ సమావేశం మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఇటీవలె తీవ్ర జ్వరంతో ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‎లో అడ్మిట్ అయిన సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటలు పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్ ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అయితే కేంద్రం ఈ సమావేశాల ఎంజెండా ఏమిటో ఇప్పటి వరకు తెలియజేయలేదు. ఈ క్రమంలో ఈ ప్రత్యేక సెషన్‎లలో లేవ‌నెత్తాల్సిన అంశాలతో పాటు కేంద్ర సర్కార్‎ను ఇరుకున పెట్టే అస్త్ర‌ాలను రెడీ చేసేందుకే ఈ పార్ల‌మెంట‌రీ వ్యూహ కమిటీ సమావేశానికి సోనియా పిలుపునిచ్చారని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా మ‌రోవైపు పార్ల‌మెంట్ స్పెషల్ సెషన్స్‎లో అనుస‌రించాల్సిన వ్యూహంపై డిస్కస్ చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి నాయకులతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ఖర్గే నివాసంలో మంగళవారం రాత్రి 7 గంటలకు జరగనుంది.




Tags:    

Similar News