మహిళా రైతులతో సోనియా గాంధీ డ్యాన్స్.. వీడియో వైరల్

Update: 2023-07-17 11:49 GMT

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హర్యానాకు చెందిన మహిళా రైతులతో కాసేపు సరదాగా గడిపారు. వారితో కలిసి డ్యాన్స్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ రుచిరా చతుర్వేడీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా ఇప్పుడు వైరల్గా మారింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జులై 8న హర్యానాలోని సోనేపట్‌లోని మదీనా గ్రామంలో పర్యటించారు. పొలాల్లో పనిచేస్తున్న మహిళా రైతులను కలిసి వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ మహిళా రైతులు ఢిల్లీని, అక్కడ ఉన్న రాహుల్ గాంధీ ఇంటిని చూడాలన్న కోరికను వ్యక్తం చేశారు. అయితే లోక్‌సభకు అనర్హత వేటు వేయడం, న్యూ ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ప్రభుత్వం తీసేసుకుందని ఆయన వారికి చెప్పారు. రాహుల్ గాంధీ ఆ విషయాన్ని తల్లి సోనియాకు చెప్పారు.

రాహుల్ నుంచి విషయం తెలుసుకున్న సోనియా గాంధీ ఆ మహిళా రైతులను ఢిల్లీకి రప్పించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ కార్యకర్త రుచిరా చతుర్వేది ఆదివారం వారిని హర్యానా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. మహిళా రైతులతో కలిసి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు కాసేపు సరదాగా కలిశారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మహిళా రైతులతో కలిసి సోనియా గాంధీ డ్యాన్ చేశారు. ఈ వీడియోను రుచిరా చతుర్వేది ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

జులై 8న రాహుల్ గాంధీ వరి పొలాలను సందర్శించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాదాపు 12 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆయన రైతులు, వారి కుటుంబాలతో మాట్లాడటం, పొలాలు దున్నడం, వరి నారు వేయడం ఉంది. "రైతులే భారతదేశానికి బలం" అని హిందీలో ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ వీడియో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News