అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ.. సౌతాఫ్రికా క్రికెటర్ ఏమన్నారంటే..?

Byline :  Krishna
Update: 2024-01-22 06:58 GMT

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠకు మరికొన్ని క్షణాలే ఉంది. 12.29 నిమిషాలకు బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఆలయానికి చేరుకున్నారు. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సౌతాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ భారతీయులకు స్పెషల్ విషెస్ చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.

‘‘అందరికీ నమస్కారం.. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుంది. సౌతాఫ్రికాతో పాటు ప్రపంచంవ్యాప్తంగా ఉన్న భారత సంతతి ప్రజలకు ఇవేనా శుభాకాంక్షలు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నా. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్‌’’అని కేశవ్‌ అన్నారు. భారత సంతతి వ్యక్తి అయినా కేశవ్ క్రికెట్లో సౌతాఫ్రికా తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పలు మ్యాచుల్లో కేశవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శ్రీరాముని పాటలు వినిపించడం గమనార్హం.

Tags:    

Similar News