South Central Railway : పండుగ వేళ స్పెషల్ ట్రైన్స్‌ పేరుతో 'స్పెషల్' బాదుడు

Update: 2023-10-12 07:38 GMT

దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల కోసం 621 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే పేద, మధ్య తరగతుల ప్రజలు తెగ సంబరపడిపోయారు. పండుగకు ఎంచక్కా సొంతూరుకు వెళ్లొచ్చనుకుని ప్లాన్‌లు వేసుకున్నారు. కానీ వారి ఆశలపై దక్షిణ మధ్య రైల్వే నీళ్లు చల్లుతూ..  (South Central Railway)స్పెషల్ ట్రైన్స్ పేరుతో స్పెషల్ ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది.




 


పండుగల సందర్భంగా నగరవాసులు అత్యధిక సంఖ్యలో వెళ్తారని , ఇదే సరైన సమయంగా భావించి చార్జీలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం రెగ్యులర్‌ టికెట్‌ చార్జీలపై అదనంగా 30 నుంచి 50 శాతం వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు రైల్వే చార్జీలు తలకు మించిన భారంగా మారుతున్నది. పైగా రిజర్వేషన్‌కు దాదాపు రెండు నెలలు ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నా.. సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అంతా వెయిటింగ్‌ లిస్టు, ఆర్‌ఏసీతోనే సరిపోతుంది. ఒక వేళ టికెట్‌ బుక్‌ చేసుకుని, టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే అందులో కూడా 25 నుంచి 50 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.




 


ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్​ బుకింగ్​ కౌంటర్లు, ఫ్లాట్​పాం టికెట్ ధర పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేశ్​ చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి ప్లాట్ ఫాం టికెట్ ధరలతో పాటు , ప్రయాణ ఛార్జీల ధరలు కూడా పెరుగనున్నాయి.




Tags:    

Similar News