Speaker of Goa : గోవా స్పీకర్ మంచి మనసు..అనాథ పిల్లలకు అండ

Update: 2024-02-08 08:03 GMT

గోవా స్పీకర్ రమేశ్ తవాడ్కర్ ఇద్దరు అనాథ పిల్లల పట్ల మంచి మనుసు చాటుకున్నారు. ఆ పిల్లల కోసం శిథిలావస్థకు చేరి ఇల్లు స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రంలోని మిరాజ్ తాలుకా అరాగ్ గ్రామంలో చేందిన ఇద్దరు పిల్లలు 2018లో తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ తర్వాత కొంతకాలానికే తల్లి కూడా మరణించింది. దీంతో వారి జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం వారు తలదాచుకుంటున్న గృహం శిథిలావస్థకు చేరింది. తమకు కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వాలని స్థానిక పంచాయతీలో అర్జీ పెట్టుకున్నారు. ఇది గోవా స్పీకర్‌ రమేశ్‌ దృషికి వచ్చింది. దీంతో ఆ చిన్నారుల కోసం తన నియోజకవర్గంలో ఓ ఇంటిని సిద్ధం చేస్తున్నారు. ‘శ్రమ్‌ ధామ్‌’ పేరిట రమేశ్‌ గతంలోనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ గోవాలోని కెనకోనా నియోజకవర్గంలో నిరు పేదల కోసం ఈ కార్యక్రమం కింద 20 ఇళ్లు నిర్మిస్తున్నారు. ఆ చిన్నారుల సమస్యను అరాగ్ పంచాయతీ ఆయన దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించారు. ‘‘పేదలకు హౌస్‌లు నిర్మించే ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనుకున్నా. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సమస్య నా దృష్టికి వచ్చింది. వారికి సాయం చేయడం నా కర్తవ్యం’’ అని స్పీకర్ రమేష్ వెల్లడించారు.

Tags:    

Similar News