నేను అప్పుడే మళ్ళీ పార్లమెంటుకు వస్తాను-స్పీకర్ ఓం బిర్లా

Update: 2023-08-02 11:19 GMT

మణిపూర్ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. రోజూ ఇదే అంశం ఉభయ సభలు వాయిదా పడేలా చేస్తోంది. అధికార పక్షం దీని గురించి మాట్లాడే వరకు ఊరుకునేది లేదని విపక్షాలు పట్టుబట్టాయి. దానికోసం రోజూ ఆందోళనలు చేస్తున్నాయి. దీని మీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గుస్సా అయ్యారు. ఎంపీల ప్రవర్తనలో మార్పు వచ్చేంతవరకూ తాను సభలో అడుగుపెట్టనని చెప్పారు.

అధికార పక్షం మీద కూడా స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ జరగకుండా ఇరు పక్షాలు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. ఈరోజు సెషన్స్ కు కూడా ఆయన హాజరు కాలేదు. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను సభలోకి మళ్ళీ వస్తానని ప్రకటించారాయన.

మణిపూర్ అంశం యావత్ దేశాన్ని గడగడలాడిస్తోంది. పార్లమెంటులో సభలు వాయిదాలు పడుతున్నాయి. దీని మీద సుదీర్ఘ చర్చ జరగాలని...రూల్ నంబర్ 267 ప్రకారం ప్రధాని మోడీ మాట్లాడాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ రూల్ నంబర్ 176 ప్రకారం స్వల్ప చర్చతో ముగిస్తాయని, అది కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడతారని అధికార పక్షం చెబుతోంది. దీంతో ఈ విషయం ఎటూ తేలడం లేదు. మరోవైపు సుప్రీంకోర్టు పోలీసులను, అక్కడ నేతలకు చివాట్లు పెడుతోంది. అక్కడ మండిపోతుంటే అందరూ ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

Tags:    

Similar News