‘పది’ పాసైతే చాలు.. 1,558 కేంద్రం కొలువులు.. తెలుగులోనే పరీక్ష!

Update: 2023-06-30 15:55 GMT

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)లో ఉద్యోగాలు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 1,558 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్), స్టాఫ్ (ఎంటీఎస్), హవల్దార్ (సీబీఐసీ, సీబీఎస్) విభాగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చింది. పదో తరగతి క్వాలిఫికేషన్ తో ఈ ఉద్యోగాల పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 21 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 1,558 ఖాళీలకు గానూ.. మల్టీ టాస్కింగ్ కు 1,198, సీబీఐసీ, సీబీఎన్‌లో హవల్దార్‌ 360 పోస్టులు ఉన్నాయి.

నోటిఫికేషన్ వివరాలు:

అర్హత: ఏదైనా గుర్తింపు ఉన్న బోర్డ్ నుంచి పదో తరగతి ఉత్తీర్ణత

ఏజ్ లిమిట్: అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి పోస్ట్ లను అనుసరించి.. 18-25, 18-27గా ఉంది. పోస్ట్ బట్టి ఏజ్ లిమిట్ మారుతుంది.

సెలక్షన్ ప్రాసెస్: MTS పరీక్షకు సెషన్ 1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

హవల్దార్ పోస్టులకు.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాచి.

అప్లికేషన్ తేదీలు: జులై 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు మొదలవుతుంది. అప్లికేషన్ ఎడిట్ కు చివరి తేదీ.. జులై 26 నుంచి 28 వరకు. అంతేకాదు సెప్టెంబర్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెట్టే అవకాశం ఉంది.

ఫీ పేమెంట్: ఫీ పేమెంట్ కు చివరి తేదీ జులై 23. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు. మిగతా వాళ్లు రూ. 100 చెల్లించాలి.




Tags:    

Similar News