Supreme CJI's : సుప్రీం సీజేఐ కారు నెంబర్ ప్లేట్ వైరల్...చూస్తే వావ్ అనాల్సిందే!

Byline :  Vinitha
Update: 2024-02-19 06:31 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిస్ట్ డీవై చంద్రచూడ్‌ కారు నెంబర్ ప్లేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాయిడ్ మాథియస్ అనే బిజినెస్ ఎగ్జిక్యూటివ్..సీజేఐ నంబర్ ప్లేట్‌ను తన ట్వీటర్ ఎకౌంట్ లో షేర్ చేశారు. ఢిల్లీలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌కు సీజేఐ హాజరైయ్యారు. అయితే అదే ఫంక్షన్ కు వెళ్లిన తాను బయటికి వెళ్తున్నప్పుడు ఆ కారు నెంబర్ చూడకుండా ఉండలేకపోయానని తెలిపారు. ఇంతకీ ఆ కారు నెంబర్ ఏంటంటే...DL1 CJI 0001. ఈ నెంబర్ కు ముందు సీజేఐ ఉండడంతో ఆయన ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అయితే దీనిని బట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) కారు నంబరు DL1 CEC 0001 అని ఉండాలమే అంటూ సరదాగా సీజేఐ కారును ఫొటో తీసి పోస్ట్ చేశారు.

అయితే ఈ కారు ఏ మోడల్ ఆ అంటూ నెటిజన్లు వెతికేస్తున్నారు. సీజేఐ వచ్చిన మెర్సిడెస్ ఈ 350 మోడల్ కారు ఎవరి పేరున రిజిస్టర్ అయి ఉందా అని ఆరా తీస్తే...అది సుప్రీంకోర్టు పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుస్తోంది. దీనినిబట్టి సీజేఐకి ఆ కారును సుప్రీంకోర్టు సమకూర్చి ఉంటుందని అనుకుంటున్నారు. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ 350 డీ ఏఎంజీ లైనప్ ఈ-క్లాస్‌లో టాప్ మోడల్ కార్. ఈ కార్ ధర రూ. 88.96 లక్షలు ఉంటుంది.

Tags:    

Similar News