Patanjali Ayurved : పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Byline :  Bharath
Update: 2023-11-22 02:35 GMT

పతంజలి ఆయుర్వేద్ సంస్థపై సుప్రీంకోర్టు మండిపడింది. పలు రకాల వ్యాధులను నయం చేస్తామంటూ చేస్తున్న అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయొద్దని సూచించింది. అల్లోపతి చికిత్సను టార్గెట్ చేస్తూ ఇస్తున్న ప్రకటనల ప్రసారాలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ తరహా ప్రకటనలను నిలిపేయాలని.. లేదంటే రూ.కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రెస్మీట్లలోనూ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా ఎలాంటి తప్పదోవ పట్టించే ప్రకటనలు కూడా చేయొద్దని సూచించింది.

ఏదైనా నిర్దిష్ట వ్యాధిని నయం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తే తీవ్రంగా పరిగణంలోకి తీసుకుని.. భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆధునికి వైద్య చికిత్స తీసుకుంటున్న వారంతా చనిపోతున్నారని, అలోపతి వల్ల ప్రజలకు రోగాలు నయం అవుతున్నాయని, ఆధునిక వైద్య చికిత్స తీసుకున్న డాక్టర్లు కూడా చనిపోతున్నారని పతంజలి ప్రకటనలు చేస్తుంది. అలాగే వ్యాక్సినేషన్ సహా అల్లోపతి ఔషధాల వినియోగాన్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం జరుగుతుందని ఐఎంఏ పేర్కొంది.




Tags:    

Similar News