బాబా రామ్‌దేవ్‌కు సుప్రీం కోర్టు సమన్లు

Byline :  Vamshi
Update: 2024-03-19 07:45 GMT

యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పతంజలి యాడ్స్ ఇస్తున్నారంటూ దాఖలైన కేసులో ధిక్కార నోటీసుపై స్పందించకపోవడంతో మండిపడింది. న్యాయస్థానం ముందు హాజరు కావాలంటూ రామ్‌దేవ్‌తో పాటు కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సమన్లు జారీ చేసింది. తమ ఉత్పత్తుల్లో ఔషధ విలువలు ఉన్నాయంటూ పతంజలి చేస్తోన్న ప్రచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ప‌తంజ‌లి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజ‌రుకావాల‌ని నోటీసులు జారీ చేసింది. బాబా రాందేవ్ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు సుప్రీం పేర్కొన్న‌ది. జ‌స్టిస్ హిమా కోమ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును ఇవాళ విచారించింది.కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసులు ఎందుకు ఇవ్వ‌కూడద‌ని సుప్రీం ప్ర‌శ్నించింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌తంజ‌లి సంస్థ ఆ నోటీసుల‌కు రెస్పాన్స్ ఇవ్వ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ప్ర‌తిస్పందించ‌లేద‌ని, వ‌చ్చే విచార‌ణ స‌మ‌యంలో ఎండీ హాజ‌రుకావాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. డ్ర‌గ్స్ అండ్ రెమిడీస్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 3, 4 ప్ర‌కారం రాందేవ్‌, బాల‌కృష్ణ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు తెలిపింది.

Tags:    

Similar News