రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. ముందుంది ముసళ్ల పండగ..
కులమతాలు, ప్రాంతాలు, భాషలు.. నానా అంశాలపై స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టేలా చేసే వ్యాఖ్యలకు తెరపడనుంది. విద్వేషపూరిత ప్రసంగాలను చెక్ పెట్టడానికి ఓ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ద్వేష వ్యాఖ్యలను నియంత్రించాలంటూ షహీన్ అబ్దుల్లా అనే జర్నలిస్ట్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించి ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే మాటల వల్ల హరియాణాలోని నుహ్ జిల్లాలో మత ఘర్షణలు జరిగి ఆరుగురు చనిపోయారని అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రసంగాల వల్ల సామరస్యం దెబ్బతినమేగాకా కొన్ని వర్గాలు నష్టపోతున్నాయని వివరించారు. అలాంటివి దేశ ప్రజలకు కీడు చేస్తూయంటూ కోర్టు కూడా అంగీకరించింది. ఇలాంటి ప్రసంగాల కేసులపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నెల 18లోగా తమకు సమధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రసంగాల వల్ల నష్టం జరుగుతోందని చెప్పే ఆధారాలను తమకు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
supreme court orders immediate committee formation to control hate speeches
supreme court hate speeches, committee formation on control hate speeches, journalist shaheen abdullha, Haryana communal issue, indian government