Supreme Court: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీం సంచలన తీర్పు

By :  Krishna
Update: 2023-10-17 07:31 GMT

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధపై సుప్రీం కీలక తీర్పునిచ్చింది. స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం అంగీక‌రించ‌లేదు. అయితే వారు సహజీవనం చేసుకోవచ్చిని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వేర్వేరు తీర్పులిచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని.. కానీ అది న్యాయసమీక్షకు లోబడి ఉండాలని సీజేఐ సూచించారు.

స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు, ఉన్నత వర్గాలకు మాత్రమే సంబంధించినది కాదని సీజేఐ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 స్వలింగ సంపర్కులకు కూడా మిగతా వారిలాగానే అన్ని హక్కులు కల్పిచిందని వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం స్వాతంత్య్రానికి ముందున్న కాలానికి వెళ్లినట్లేనని సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సహచర భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ, హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. లైంగిక అలవాటు ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపొద్దన్నారు.

స్వలింగ బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. వివాహేతర జంటలతో పాటు స్వలింగ సంపర్కులు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ స్పష్టం చేశారు. ఆడ, మగ జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదని చెప్పారు. ఇక ఈ అంశంపై సుధీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం మే 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించింది.

Tags:    

Similar News