మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశం మొత్తం ఆగ్రహించింది. ఈ విషయంపై సుప్రీకోర్టులో వాదనలు మొదలయ్యాయి. మహిళల్ని నగ్నంగా ఊరేగించే వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. బాధిత మహిళల పక్షాణ సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. మే 3నుంచి మణిపూర్ లో అల్లర్లు జరుగుతుంటే ఎన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారన్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి దేశంలో చాలా జరిగాయని, మణిపూర్ లో ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో దర్యాప్తుకు మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. సిట్ లోని మహిళా న్యాయమూర్తులు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడనున్నారు. అంతేకాకుండా ఈ కేసును ధర్మాసనం సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా బాధిత మహిళల్లో ఒకరి సోదరుడు, తండ్రి మరణించగా.. వారి మృతదేహాలు ఇప్పటికీ కుంటుంబానికి అప్పగించలేదు.