"జరిగింది బాధాకరం.. అయినా అజిత్ ఎప్పటికీ నాకు సోదరుడే".. సుప్రియా సూలే

Update: 2023-07-03 07:34 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం భారీ ట్వీస్ట్ నెలకొన్న సంగతి తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు అజిత్ పవార్.. సొంత పార్టీకే భారీ షాక్ ఇచ్చారు. పార్టీని రెండు ముక్కలుగా చీల్చుతూ.. 8 మంతి ఎమ్మెల్యేలతో కలిసి పార్టీపైకి తిరుగుబాటు చేశారు. అనంతరం షిండే-బీజేపీ శిబిరంలో చేరారు. దీంతో ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ కు, తన సోదరికి మధ్య విభేదాలు వచ్చాయని వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కొట్టిపారేశారు. తమ మధ్య అలాంటిదేదీ లేదని ఆమె స్పష్టం చేశారు




 


తిరుగుబాటు చేసిన వారంతా తిరిగి పార్టీలోకి వస్తే తాను సంతోషిస్తానని సుప్రియా చెప్పారు. . ‘‘పార్టీ పునర్నిర్మాణం కోసం పోరాడతాం. రెబల్స్ తిరిగి పార్టీలోకి వస్తే సంతోషిస్తాం. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. అజిత్ దాదాతో నా సంబంధాలు మారవు. ’’ అని అన్నారు. ‘జరిగింది కచ్చితంగా బాధాకరం. అజిత్ దాదా అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆయన ఎప్పటికీ నాకు సోదరుడే.’’ అని ఆమె అన్నారు. తన తండ్రి శరద్ పవార్ పార్టీలో అందరినీ కుటుంబంలా చూసుకున్నారని, కాని ఈ సంక్షోభానికి కారణాలపై పార్టీ విశ్లేషిస్తుందని సుప్రియా చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాల ఐక్యతను ప్రభావితం చేయవని సుప్రియా అన్నారు.




 


ఎన్సీపీతో తెగదెంపులు చేసుకున్న అజిత్ పవార్ .. ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా చేరారు. ఛుగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ వంటి శరద్ పవార్ విధేయులు సహా 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. గత నెలలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే బాధ్యతలు చేపట్టడమే .. అజిత్ పవార్ తిరుగుబాటుకు కారణమని టాక్. 

Tags:    

Similar News