500 వైన్ షాపుల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం

Update: 2023-06-21 13:16 GMT

ఎన్నికల్లో ఇచ్చిన సంపూర్ణ మధ్యపాన నిషేధ హామీని అమలు చేసే విధంగా తమిళనాడు సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 500 మద్యం దుకాణాలను మూసివేయాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న వైన్ షాపులను బంద్ చేయాలని భావిస్తోంది. జూన్‌ 22 నుంచి మూసివేస్తున్నట్టు రిటైలర్‌ టాస్మాక్‌ బుధవారం ప్రకటించింది.

తమిళనాడులో మొత్తం 5328 రీటైల్ మద్యం షాపులు ఉన్నాయి. వాటిని విడతల వారిగా మూసివేసే ఆలోచన చేస్తున్నారు. ముందుగా 500 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏప్రిల్‌లోనే మద్యం దుకాణాల మూసివేతపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటన చేశారు.    


Tags:    

Similar News