మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు కోర్టు ఈనెల 28 వరకు బాలాజీకి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దాంతో తమిళనాడులో హైడ్రామా మొదలయింది. అరెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ల కోసం బాలాజీని హాస్పిటల్ తరలించగా.. మార్గ మధ్యలో మంత్రి ఛాతి నొప్పి అని ఏడ్చేశారు. ఆయనను టెస్ట్ చేసిన డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు.
తర్వాత మంత్రికి కరోనరి యాంజియోగ్రామ్ నిర్వహించారు. తర్వాత ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ లో బాధపడుతున్నట్లు గుర్తించి.. బైపాస్ సర్జరీ చేసుకోవాలని సూచించారు. దీనిపై గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బులిటెన్ ను విడుదల చేసింది. మంళవారం నుంచి సెంథిల్ బాలజీని మనీ లాండరింగ్ కేసులో విచారించిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాలాజీని.. డిశ్చార్జి అయిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు.