Udayanidhi Stalin : మరోసారి సనాతన ధర్మంపై నోరుపారేసుకున్న ఉదయనిధి స్టాలిన్

Byline :  Aruna
Update: 2023-09-20 08:54 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు. మనుషుల్లో అంటరానితనం నశించాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఉదయనిధి మరోసారి వార్తల్లో నిలిచారు. దేశవ్యాప్తంగా కలకలం రేపారు.

" సనాతన ధర్మంపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. మనుషుల మధ్య అంటరానితనం నశించాలంటే, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి. అప్పుడే అంటరానితనం పోతుంది. సనాతన ధర్మం వల్లే ఇది వచ్చింది. అందుకే సనాతన ధర్మం ఉండకూడదు"అని ఉదయనిధి అన్నారు.




Tags:    

Similar News