ఎయిర్ ఇండియాకు కొత్తరూపు

Update: 2023-08-08 13:22 GMT

ఎయిర్ ఇండియా రీబ్రాండింగ్ కు సిద్ధమైంది. అందులో భాగంగానే దీని లోగో కూడా మారుస్తున్నారు. ఈ నెల 10 న కొత్త లోగోను ఆవిష్కరించనున్నారు. లోగోతో పాటూ రంగు కూడా మార్చనున్నారని తెలుస్తోంది.

ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేయాలని అనుకుంది. పాతలోగో స్థానంలో కొత్త లోగో, కొత్త కలర్ రానున్నాయి. నారింజ రంగు కోణార్క్ చక్రం, ఎరుపు రంగు హంసలతో ఇప్పటివరకు ఎయిర్ ఇండియా లోగో ఉండేది. ఇక మీదట ఎయిర్ లైన్ అభివృద్ధి చెందుతున్న గుర్తింపును ప్రతిబింబిస్తూ కొత్త లోగో రాబోతోంంది. జనవరి 2022లో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేసింది. టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టాటా సన్స్ ఎయిర్ లైన్స్ లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఎయిర్ ఇండియాతో పాటూ టాటాసన్స్ మరొక అనుబంధ సంస్థను కూడా ఇందులో విలీనం చేసింది. ఈ విలీనం 2024కు పూర్తవుతుంది అంచనా వేస్తోంది కంపెనీ. అందుకే ఇప్పటి నుంచీ రీబ్రాండింగ్ ప్రక్రియను మొదలుపెడుతోంది.




 


లివరీ, క్యాబిన్ ఇంటీరియర్, క్రూ యూనిఫామ్, లోగో మొత్తం అన్నీ మారనున్నాయి. తమ బ్రాండ్ కు అనుగుణంగా టాటా వీటిని మార్చాలని నిర్ణయించుకుంది. దీంతో పాటూ కొత్త పేవలను కూడా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందని ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంపె బెల్ విల్సన్ తెలిపారు. 1946లో ఎయిరం ఇండియా ప్రారంభం అయింది. అప్పటి నుంచి మహారాజా అనేది ఎయిర్ ఇండియా గుర్తింపుగా ఉంది. ఇప్పుడు దాన్ని కూడా మారుస్తారా లేదా అనే విషయం మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.


 




 


Tags:    

Similar News