టాక్స్ కడుతున్న వారే ఎక్కువ-పెరుగతున్న కోటీశ్వరులు

Update: 2023-08-08 13:13 GMT

భారతదేశంలో పన్ను కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందులో కూడా కోటీశ్వరుల సంఖ్య మరింత పెరుగుతోంది అని చెబుతోంది ఐటీ శాఖ. కరోనా తరువాత ఈ సంఖ్య పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోందని లెక్కలు బయటపెట్టింది.

ఐటీ రిటర్స్స్ గడువు ముగిసింది. దీంతో పన్నుల కట్టేవాళ్ళ లెక్కలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే కరోనా తరువాత పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఐటీ రిటర్స్స్ రూపంలో వస్తున్న ఆదాయం కూడా బాగా పెరిగింది. ఐటీ శాఖ లెక్కల ప్రకారం ఒక కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు 2.69 లక్షల మందికి పైగా రిటర్స్స్ దాఖలు చేశారు. ఇది 2018-19 ఏడాదితో పోల్చితే 49.4 శాతం పెరిగింది. 2019-20తో పాలిస్తే 41.5 శాతం పెరిగింది. కానీ 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ మాత్రం చాలా తక్కువగానే పెరిగాయని అంటోంది ఐటీ శాఖ. ఇది 1.4 శాతం మాత్రమే అని లెక్కలు చూపిస్తోంది.




 


2021-22 ఏడాదికి 1.93 లక్షల మంది టాక్స్ రిటర్న్స్ చేయగా 2022-23 సంవత్సరంలో మాత్రం 2.69 లక్షల మంది టాక్స్ రిటర్స్న్ చేశారు. 5 లక్షల ఆదాయం ఉన్నవారు గత ఏడాది 4.94 కోట్ల మంది పన్ను చెల్లించగా ఈ ఏడు మాత్రం 5.68 కోట్ల మందికి పెరిగారు. కానీ 50 లక్సల నుంచి కోటి మధ్య ఆదాయం వచ్చేవారు, అలాగే 5 లక్షల నుంచి 10 లక్సల మధ్య ఆదాయం ఉన్నవారి టాక్స్ రిటర్స్స్ తగ్గుతున్నాయి.




 


Tags:    

Similar News