TCS SCAM: టీసీఎస్లో స్కాం.. 16 మందిపై వేటు

By :  Bharath
Update: 2023-10-16 07:46 GMT

దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) 16 మంది ఉద్యోగులను తొలగించింది. అంతేకాకుండా టీసీఎస్ తో వ్యాపారం చేస్తున్న ఆరుగురు విక్రేతలను నిషేదించింది. ‘లంచాలకు ఉద్యోగాలు’ స్కాంలో వీళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించిన టీసీఎస్, ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది టీసీఎస్. ఈ స్కాంపై జూన్ 23న విచారణ చేపట్టిన టీసీఎస్.. రీసోర్ట్ మేనేజ్ ఫంక్షన్ లో ఉద్యోగాల నియామకాల కోసం లంచాలు తీసుకున్నట్లు గుర్తించింది. కంపెనీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు 19 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ క్రమంలో కంపెనీ రిసోర్స్ మెనేజ్మెంట్ గ్రూప్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. ఉద్యోగుల నియామకాల్లో లంచాలు తీసుకున్నారని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆరోపించారు. ఈ స్కాంలో భాగం అయి.. దాదాపు 100 కోట్ల దాకా కమిషన్లు తీసుకున్నారని చెప్తున్నారు.

Tags:    

Similar News