IND vs NZ: నేడే బిగ్ ఫైట్.. టీమిండియా అభిమానుల్లో టెన్షన్ టెన్షన్
ఇంకా కళ్ల ముందే ఉన్నాయి ఆ క్షణాలు. 2019 వరల్డ్ కప్ లో గ్రాండ్ గా సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత జట్టు.. న్యూజిలాండ్ చేసిలో ఓడిపోవడం. ధోనీ ఒక్క రనౌట్ తో యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోవడం. కాగా ఆ జ్ఞాపకాలను మర్చిపోయేలా.. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ స్టేజ్ లో ఆడిన 9 మ్యాచుల్లో గెలుపొంది గ్రాండ్ గా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ట్విస్ట్ ఏంటంటే ఈసారి కూడా సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండే. ఆ చేదు జ్ఞాపకాలు మర్చిపోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన టైం అని అభిమానులు ఆశిస్తున్నారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ కోసం ప్రపంచమే ఎదురుచూస్తుంది. టీమిండియా ఫామ్ బట్టి చూస్తే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగడం ఖాయం. ఇటు ఆల్రౌండ్ నైపుణ్యంతో కివీస్ జుట్టు కూడా గొప్పగా కనిపిస్తోంది. ఏది ఏమైనా వరల్డ్ కప్ 2019 సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కివీస్ ను లీగ్ దశలోనే ఓడించినా సెమీస్ లో మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే.. ఆ జట్టుకిది వరుసగా ఐదో సెమీస్. 2007, 2011 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఓడిపోయింది. 2015, 2019లో వరల్డ్ కప్ ల్లో రన్నరప్ గా నిలిచింది. ట్రోఫీ గెలిచే ఛాన్స్ అన్నిసార్లు కోల్పోయిన న్యూజిలాండ్.. ఈసారి అంత ఈజీగా తిరిగి వెళ్లదు. అందుకే, రోహిత్ సేన పకడ్బందీగా ప్లాన్ చేసి, కివీస్ ను ఓడించాల్సి ఉంటుంది.