27న అమిత్ షా సభ.. ఎన్నికల శంఖారావం పూరించనున్న బీజేపీ

Update: 2023-08-23 05:55 GMT

రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ప్రకటించి రేసులో దూసుకుపోతుండగా.. బీజేపీ, కాంగ్రెస్ లు సైతం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ టికెట్ల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తుండగా.. బీజేపీ వచ్చే నెల రెండో వారంలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. అంతకన్నా ముందు సభలు, సమావేశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, భారీ బహిరంగ సభలు, సోషల్ మీడియా ప్రచారం, బూత్ కమిటీల బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో జరగనున్న అమిత్ షా సభతో ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈసభలో అమిత్ షా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన అనంతరం జరగనున్న తొలి సభ కావడంతో దాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.


 



ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నారు. వారిచ్చే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెలాఖరున అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ భావించినా ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. సెప్టెంబర్ రెండో వారంలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.




Tags:    

Similar News