హిమాచల్ ప్రదేశ్లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

Update: 2023-07-11 11:16 GMT

భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. బియాస్ నది ఉగ్రరూపంతో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ఇల్లు సహా వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కసోల్ ప్రాంతంలో తెలుగు విద్యార్థులు చిక్కుకపోయారు.

హిమాచల్ను భారీ వరదలు ముంచెత్తడంతో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇందులో నలుగురు తెలుగు విద్యార్థులు.. ముగ్గురు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉంది. కసోల్ లోని ఓ హెటల్లో విద్యార్థులు బస చేసినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి వారితో కాంటాక్ట్ లేదని మిస్సైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళణ చెందుతున్నారు.

విద్యార్థుల చిక్కుకపోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ను అప్రమత్తం చేసి.. బాధిత విద్యార్థులకు సహాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాయం కావాల్సిన వారు ఢిల్లీలో ఉన్న తెలంగాణ భ‌వ‌న్‌ను లేదా త‌మ‌ ఆఫీసును సంప్ర‌దించ‌గ‌ల‌ర‌ని మంత్రి పేర్కొన్నారు.

telugu students stuck in himachal prdesh kasol

telugu students,himachal pradesh,heavy rains,floods,minister ktr,sikkim,telangana

Tags:    

Similar News