జులై 1 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉంది. యాత్రకు వచ్చే భక్తులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయాలని.. పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదులు కుట్ల చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.
ముఖ్యంగా.. యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను టార్గెట్ చేసుకుని ఉగ్ర దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ దాడుల కోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు.. ఉగ్ర వాదులు దాడి బాధ్యతలను అప్పగించినట్లు నిఘా వర్గాలు చెప్పుకొచ్చాయి. దీంతో రాజౌరీ- పూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడికి పాల్పడే ఇద్దరు యువకులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.