Bandi Sanjay : పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుస్తున్నాం : బండి సంజయ్

Byline :  Krishna
Update: 2024-02-07 07:35 GMT

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్నీ స్థానాల్లో గెలవడం ఖాయమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని 17 స్థానాలు గెలిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సర్వే రిపోర్టులన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని.. మరోసారి మోదీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన అన్నీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు తాము వ్యతిరేకం కాదని.. కానీ కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం అందరికీ అమలు చేయాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని బీఆర్ఎస్ నేతలు అనడం కరెక్ట్ కాదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతల అహంకారానికి ఈ మాటలే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు భాషను మార్చుకోవాలన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని గౌరవించావాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా పథకాలను అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పారు.  


Tags:    

Similar News