జలపాతంలోకి దూసుకెళ్లిన కారు.. లోపల బాలిక.. ఆ తర్వాత..

Update: 2023-08-07 12:20 GMT

విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని విపత్తు ఎదురైంది. సరదాగా గడిపేందుకు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లగా.. ఉన్న సంతోషం కాస్త మాయమైంది. వారు వెళ్లిన కారు జలపాతంలోకి దూసుకెళ్లింది. కాగా ఆ కారులో 12ఏళ్ల బాలిక ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. లోధియా కుంద్ జలపాతం చూడడానికి ఓ కుటుంబం కారులో వెళ్లింది. అయితే కారును జలపాతం సమీపంలో పార్క్ చేసి వెళ్లగా.. లోపల 12 ఏళ్ల బాలిక కూర్చోని ఉంది.




 


కాసేపటికే కారు జలపాతంలోకి దూసుకెళ్లింది. హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పాప గేర్ రాడ్ను కదిలించగా.. అది ముందుకు దూసుకెళ్లి జలపాతంలో పడిపోయినట్లు సమాచారం. వెంటనే పాప తండ్రి సహా స్థానికులు నీటిలోకి దూకి కారు డోర్ తెరిచి చిన్నారిని కాపాడారు. ఈ ఘటనలో తండ్రి, కూతురిగా స్వల్ప గాయలవ్వగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను కొందరు పర్యాటకులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో..అది వైరల్గా మారింది.




Tags:    

Similar News