ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. డియర్‌నెస్ అలవెన్స్ అయిన డీఏను 4 శాతం పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. పెంచే ఆ డీఏ 2024 జనవరి 1వ తేది నుంచి అమలు కానుంది. ఉద్యోగుల ఖర్చులు అంతకంతకూ పెరుగుతూ ఉండటమే కాకుండా జీవన వ్యయం భారంగా మారుతున్న సమయంలో డీఏ పెంపు ప్రకటన చాలా మందికి భారీ ఊరటను అందించనుంది.
డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. భారత దేశ సీపీఐ-ఐడబ్ల్యూ డేటా ఆధారంగా ఆ పరిమితిని కేంద్రం నిర్ణయిస్తూ ఉంటుంది. 2023 అక్టోబర్‌లో డీఏ 4 శాతం పెరగడంతో 46 శాతానికి చేరింది. తదుపరి డీఏ కూడా 4 శాతం పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే అధికారిక లెక్కల ప్రకారం 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.