కుక్కల కోసం గుడి..ప్రతి రోజూ ప్రత్యేక పూజలు

Update: 2023-07-28 06:41 GMT

కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. చాలా సార్లు ఈ విషయం నిరూపితమైంది. వాటిపైన కాస్త ప్రేమ చూపిస్తే చాలు యజమానికి నీడలా ఉంటుంది. తన యజమాని కోసం శునకాలు ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి. అందుకే ఈ మధ్య పెట్ డాగ కల్చర్ బాగా పెరిగిపోయింది. భరాత్‎లోనే కాదు విదేశాల్లోనూ చాలా మంది కుక్కలకు తమ పిల్లల కంటే ప్రేమగా పెంచుకుంటున్నారు. కంటి పాపలాగా వాటిని కాపాడుకుంటున్నారు. అయితే కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం శునకాలను దైవంగా భావిస్తున్నారు. వాటి కోసం ఏకంగా గుడిని కట్టి వారి భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి రోజూ ఈ గుడిలో కుక్కలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.




 


కర్ణాటకలోని చన్నపట్న అగ్రహార వలగెరెహల్లి గ్రామంలో ఈ కుక్కల గుడి ఉంది. ఇక్కడి గ్రామస్తులు తమ గ్రామ దేవతను పూజింజే కంటే ముందే శునకాలకు మొదటి పూజ నిర్వహిస్తారు. కుక్కల గుడికి ఓ ప్రత్యేక కథ ఉంది. ఊరిలో ప్రధాన దేవత కెంపమ్మ ఆలయాన్ని నిర్మించిన కొన్ని రోజులకే ఆ గ్రామంలోని రెండు కుక్కలు ఉన్నట్లుండి మాయమయ్యాయట. అవి కనిపించకుండా పోయిన కొన్న రోజులకే ఓ వ్యక్తి కలలో కుక్కలకు గుడి కట్టాలని ఎవరో చెప్పారట. ఈ విషయాన్ని ఆ వ్యక్తి గ్రామస్తులకు తెలియజేయడంతో కుక్కల కోసం ప్రత్యేకంగా గుడి కట్టి వాటికి పూజలు చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు ఏటా శునకాల పేరుతో పెద్ద పండుగనే చేసుకుంటుంటారు గ్రామస్తులు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని అక్కడివారి నమ్మకం. గ్రామ ప్రజలే కాదు చుట్టుపక్కన ఉన్నవారి పెద్ద ఎత్తున కుక్క గుడికి వచ్చి పూజలు చేస్తుంటారు.  




 




 


Tags:    

Similar News