కొనసాగుతున్న వరద.. ప్రమాదస్థాయి దాటిన యమునా..

By :  Lenin
Update: 2023-07-24 03:14 GMT

ఢిల్లీలో యమునా నది ప్రవాహ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతోంది. దీంతో యమున నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. పాత రైల్వే బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం 206.42 మీటర్లుగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో యమునా నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. వర్షాలు కొనసాగుతుండటంతో వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు

యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నది ఉగ్రరూపం దాల్చడంతో పాత రైల్వే బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. వంతెనపైకి వాహనాలను అనుమతించడం లేదు. హర్యానాలోని హత్నికుండ్‌ బ్యారేజి నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయడంతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది.

Tags:    

Similar News