Shivling : సముద్రంలో భారీ శివలింగం లభ్యం...ఎక్కడంటే?

Update: 2024-02-11 03:11 GMT

గుజరాత్ లో భారీ శివలింగం లభించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు టన్ను బరువున్న భారీ శివలింగం దొరికింది. ఈ ఘటన భారుచ్ జిల్లాలోని కావీ గ్రామంలో వెలుగు చూసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు ముందుగా వల విసిరారు. దీంతో చాలా బరువైనది ఏదో వలకు చిక్కిందని వారు అనుకున్నారు. ఎంటో తెలుసుకుందామని వలను బయటికి తీయగా శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు టన్ను బరువున్నప్పటికీ జాగ్రత్తగా దాన్ని పడవమీదకు చేర్చి వడ్డుకు తీసుకువచ్చారు. అంతేగాక శివలింగం మీద పామును చెక్కినట్టు కూడా బయటపడింది. విషయం తెలిసిన స్థానికులు శివలింగాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఈ లోపు జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఈ శివలింగాన్ని స్థానిక కమలేశ్వర్ మహాదేవ్ గుడి లేదా సమీపంలోని ఇతర శివాలయంలో ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారు.

Tags:    

Similar News