సినీ ఇండస్ట్రీపై జాలి పడుతున్నా.. కాంగ్రెస్ మహిళా లీడర్

Update: 2023-07-10 04:09 GMT

మణిపూర్ హింస సహా పలు అంశాలపై సినిమా ఇండస్ట్రీ మౌనం వహించడంపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే స్పందించారు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమ పట్ల తాను జాలిపడుతున్నానని, ఇది బిజెపికి సాఫ్ట్ టార్గెట్ అని ఆమె అన్నారు. "2014కి ముందు, EDకి భయపడకుండా మీరు స్వేచ్ఛగా జోకులు వేసుకున్న సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి" అంటూ సెలబ్రిటిలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆదిపురుష్ వివాదంలోనూ సుప్రియా స్పందించారు. హిందూ దేవతల పాత్రల చేత వీధి రౌడిల భాష మాట్లాడేలా చేసిన రచయిత మనోజ్ ముంతాషిర్ పై మండిపడ్డారు. మతానికి, మత వ్యాపారానికి మధ్య తేడా ఇదేనంటూ సినిమా తీసిన వ్యక్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక మణిపూర్​లో జరిగిన అల్లర్ల కారణంగా ఇప్పటివరకూ 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3,000 మందికి పైగా గాయపడ్డారు. షెడ్యూల్డ్ తెగ (ST) కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాలలో నిర్వహించిన ఆదివాసి సంఘీభావ యాత్ర... తీవ్ర హింసకు కారణమైంది. మే 3 వ తేదిన ప్రారంభమైన ఈ అల్లర్లు ఇంకా ఆగలేదు. మూడు రోజుల క్రితం కూడా ఈ అల్లర్ల కారణంగా నలుగురు మరణించారు.

Tags:    

Similar News