ఇవాళ్టి నుంచి ఐదు రోజల పాటు జరిగే స్పెషల్ పార్లమెంట్ సెషన్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొత్త భారత్ను కొత్త పార్లమెంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. కొత్త సంకల్పం కొత్త నమ్మకంతో 2047 కల్లా ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న ప్రధాని.. భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పారు.
‘‘భారత ప్రతిష్ఠను పార్లమెంట్ పెంపొందించింది. పాత పార్లమెంట్ భవనం ఓ చారిత్రాత్మక కట్టడం. పాత భవనం నుంచి కొత్త భవనంలో అడుగుపెట్టే ఈ తరుణంలో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. చంద్రయాన్ 3 సక్సెస్తో భారత సత్తా ప్రపంచానికి చూపించాం. జీ20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించాం’’ అని మోదీ అన్నారు.