30 నిమిషాల్లో మూడు భూకంపాలు.. వణికిన ప్రజలు

Update: 2023-07-21 03:53 GMT

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికే అతలాకుతలమయ్యాయి. ఓ వైపు వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు వారిని భూకంపాలు భయపెడుతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇవాళ తెల్లవారుజామున మూడు భూకంపాలు సంభవించాయి. 30 నిమిషాల వ్యవధిలో మూడు భూకంపాలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.




 


మొదటి భూకంపం 4.4 తీవ్రతతో ఉదయం 4:09 గంటలకు సంభవించగా.. రెండవ భూకంపం 3.1 తీవ్రతతో 04:22 గంటలకు, మూడవది 3.4 తీవ్రతతో 4.25 గంటలకు సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు. గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది.

ఈ భూ ప్రకంపనలపై రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే స్పందించారు. ‘‘జైపూర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో భూకంపం సంభవించింది. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను’’ అని ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు మిజోరాంలోని నొగోపాలో 3.6 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది.




Tags:    

Similar News