ఇంట్లో మంటలు.. ముగ్గురు చిన్నారులు సజీవదహనం

Update: 2023-06-10 15:45 GMT

మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దానేకపురా గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో నాలుగేళ్ల బాలుడు, పదేళ్ల బాలిక, నాలుగేళ్ల బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో ఇంటి యజమాని అఖిలేష్ రాజ్‌పుత్, అతడి భార్య, కూతురు, కోడలు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెప్పారు. వీరిలో అఖిలేష్ రాజ్‌పుత్, అతడి భార్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. గ్యాసు సిలిండర్ లీకేజీ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News