ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. దేవుడే బతికించిండు

Update: 2023-06-03 12:53 GMT

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. బెంగాల్కు చెందిన సుబ్రతో పాల్, ఆయన భార్య దేబోశ్రీ వారి కుమారుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ప్రమాద ఘటన గుర్తొస్తే నిద్రపట్టడంలేదని అంటున్నారు. భయంకరమైన ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించి దేవుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని చెబుతున్నారు

బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌ గ్రామానికి చెందిన సుబ్రతో కుటుంబసభ్యులతో కలిసి చెన్నై బయలుదేరాడు. కొడుకు హాస్పిటల్ లో చూపించేందుకు కోరమాండల్ రైలు ఎక్కారు. దేవుడి దయతో బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. యాక్సిడెంట్ తర్వాత కాసేపు షాక్ కు గురయ్యామని, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదని చెప్పారు. కంపార్ట్మెంట్ అంతా పొగతో నిండిపోయిందని, ఎవరూ కనిపించలేదని సుబ్రతో చెప్పారు. స్థానికులు సాయం చేయడంతో బోగీ నుంచి బయటకు వచ్చామని అన్నారు. అయితే తన భార్య, కొడును కలుసుకునేందుకు కొన్ని గంటల సమయం పట్టిందని గుర్తు చేసుకున్నారు.

ప్రమాదస్థలిలో చూసిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నాయని సుబ్రతో భార్య దేబో శ్రీ అన్నారు. యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడ్డామో తెలియదని చెప్పారు. దేవుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడన్న ఆమె.. బతికున్నంత వరకు ఆ ప్రమాద దృశ్యాలు మరిచిపోలేనని చెప్పారు. 

Tags:    

Similar News