Mamata Banerjee : వచ్చే ఎన్నికల్లో పోటీపై మమతా బెనర్జీ సంచలన నిర్ణయం

Byline :  Krishna
Update: 2024-01-24 07:46 GMT

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ సంచలన ప్రకటర చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని వివరించారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగాల్లో సీట్ల పంపకాలపై తన ప్రతిపాదనలను ఇండియా కూటమి సమావేశంలో తిరస్కరించినట్లు టీఎంసీ అధినేత్రి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు.

ఇండియా కూటమిలోనే ఉన్నా బెంగాల్లో రాహుల్ యాత్రపై తమకు సమాచారం లేదని మమతా ఆరోపించారు. సమాచారం ఇవ్వకుండా రాహుల్ యాత్రపై చేపడుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా 42 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్కు 2 ఇవ్వాలని మమతా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. ఆమె దయాదాక్షిణ్యాలతో తమకు పోటీ చేయాల్సిన అవసరం లేదని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. మమతా అవకాశవాది అని విమర్శించారు. 2011లో కాంగ్రెస్ దయతోనే ఆమె అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News