Today gold price :బంగారం ధర ఢమాల్.. వెండిదీ అదే బాట..

Update: 2023-09-13 08:25 GMT

పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలకు నెమ్మదిగా దిగివస్తున్నాయి. బుధవారం ధరలు మరింత భారీగా పతనమయ్యాయి. వెండి ధర కూడా తగ్గింది. మేలిమి బంగారం 60 వేల వద్దే కదలాడుతూ మరికొంత కాలం తగ్గుదల కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు 340 తగ్గి, రూ. 54,840 నుంచి రూ. 54,500కు చేరింది. 24 కేరట్ల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 59,830 నుంచి రూ. 59,450కు పడిపోయింది. ఇక వెండి ధర కేజీకి రూ. 1000 తగ్గి రూ. 77,000 వద్ద స్థిరపడింది. వారం, పది రోజులుగా బంగారం ధరలు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం లెక్కలతోపాటు వడ్డీ రేట్లు సవరించే అవకాశం ఉండడంతో మదుపర్లు ఆచితూచి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలు కనిపిస్తున్నట్టు భావిస్తున్నారు.

Tags:    

Similar News