Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పడిపోతున్న ధరలు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-02 02:20 GMT



Thumb: భారీగా తగ్గుతున్న బంగారం ధర

రాబోయే దీపావళీ పండుగ సందర్భంగా బంగారం కొనేందుకు సిద్ధం అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. పసిడితో పాటు వెండి రేట్లు కూడా పడిపోతున్నాయి. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు మహిళలు. మరో పది రోజుల్లో దీపావళి, ఆ తర్వాత కార్తీక మాసం.. శుభకార్యాలు, వ్రతాలు ప్రత్యేకంగా జరుపుకునే మాసం ఇది. ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. అలాంటి వారందరికీ ఇది మంచి సమయం. బంగారం ధరలు గత మూడు రోజుల్లో రూ.వెయ్యికి పైగా తగ్గాయి.

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర అక్టోబర్ 30న తులానికి రూ. 230 మేర, అక్టోబర్ 31న రూ. 550 మేర, నవంబర్ 1న రూ. 320 మేర తగ్గి ప్రస్తుతం రూ. 61 వేల 530 వద్దకు వచ్చింది. అందువల్ల మొత్తంగా చూస్తే పసిడి రూ. 1,100 మేర దిగి వచ్చింది. బంగారు కొనుగోలు దారులకు ఇది ఊరట కలిగించే అంశం. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు రూ. 56,400 వద్ద ఉంది. గత మూడు రోజుల్లో ఈ పసిడి రేటు రూ. 1,000కు పైగా పడిపోయింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,530 వద్ద కొనసాగుతోంది. ఈ పండుగకి ముడి బంగారంతో పాటు ఆభరణాలు ఎక్కువగా సేల్ అవుతుంటాయి. వెండికి సైతం మంచి డిమాండ్ ఉంటుంది.

వెండి ధరలు కూడా బంగారం దారిలోనే ప్రయాణిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై ఏకంగా రూ. 1200 తగ్గి రూ. 74,100 వద్ద కొనసాగుతోంది. ఇక గురువారం చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. ఒక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,100గా ఉండగా బెంగళూరులో రూ. 74,000గా ఉంది. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది.




Tags:    

Similar News