Manipur issue: మణిపూర్ అంశంపై మాట్లాడ్డానికి 80 రోజులు ఎందుకు పట్టింది?

Update: 2023-08-08 07:49 GMT

మణిపూర్ ఘటనను నిరసిస్తూ ఎన్డీఏపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో పాల్గొనేందుకు హౌస్‌లోని పార్టీల సంఖ్యాబలాన్ని బట్టి మాట్లాడేందుకు పార్టీలకు స్పీకర్ సమయం కేటాయించారు. అవిశ్వాస తీర్మానంపై మొత్తం చర్చ 16 గంటలు జరగనుండగా.. బీజేపీకి 6.41 గంటలు, కాంగ్రెస్‌కుగంటా 41 నిమిషాలు, డీఎంకు 30 నిమిషాలు, టీఎంసీకి 30 నిమిషాలు, వైసీపీకి 29 నిమిషాలు, బీఆర్ఎస్‌కు 12 నిమిషాల సమయం కేటాయించారు.

బీజేపీ తరుఫున 15 మంది ఎంపీలు చర్చలో పాల్గొననున్నారు. ఈ 15 మందిలో తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్‌కు చోటు కల్పించడం గమనార్హం. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ చర్చను ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అవిశ్వాసం తీసుకొచ్చామని.. మణిపూర్‌కు న్యాయం కోసమే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. సంఖ్యా బలం లేదనే సంగతి తమకు తెలుసన్నారు. మణిపూర్ ప్రజలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మణిపూర్ తగలబడిపోతున్న ప్రధాని మోడీ ఇంతవరకు మణిపూర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మ

‘‘ మణిపుర్‌కు విపక్షాలు వెళ్లాయి.. రాహుల్‌ వెళ్లారు.. మోదీ ఎందుకు వెళ్లలేదు? మణిపుర్‌ తగలబడుతుంటే.. భారత్‌ తగలబడుతున్నట్లే. ఇంటెలిజెన్స్‌ వైఫల్యమే మణిపుర్‌ హింసకు కారణం. మణిపుర్‌పై 30 సెకన్లపాటు మాట్లాడేందుకు మోదీకి 80 రోజులు ఎందుకు పట్టింది? ఇంతజరిగినా మణిపుర్‌ సీఎంను ఎందుకు పదవి నుంచి తొలగించలేదు?’’ అని గొగొయ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్ తగలబడుతుంటే.. భారత్ తగలబడుతున్నట్లేనని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News