Today Gold And Silver price : మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర

Byline :  Veerendra Prasad
Update: 2023-12-05 05:18 GMT

మహిళలకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 1000 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 1090లు తగ్గింది. వెండి ధర కూడా రూ.2100(కిలో చొప్పున) తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర దిగిరావడం మహిళలకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 57,850 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,110 కు చేరింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ..

– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,260.

– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110కు చేరింది.

– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,500 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,820 కు చేరింది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర కూడా చాలా వరకూ తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 81,400 కి తగ్గింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.




Tags:    

Similar News