Gold PricesToday : మహిళలకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు చూసి.. రాబోయే రోజుల్లో ఇకాంస్త తగ్గొచ్చని భావించిన మగువలకు షాక్. ఈ రోజు బంగారం ధర 10 గ్రాములకు ఒక్కసారిగా రూ. 400 పెరిగింది. దీపావళికి కొన్ని రోజుల ముందు, దీపావళి నాడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. ఈ లెక్కల ప్రకారం.. మహిళలు కార్తీకమాసంలో పెళ్లి ముహూర్తాలు, శుభకార్యాలు ఉండడంతో ధరలు ఇంకా దిగివస్తాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. వరుసగా తగ్గి మూడు వారాల కనిష్ఠానికి దిగివచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ పెరిగాయి. తులం రేటు మళ్లీ రూ. 60 వేల స్థాయి పైనే కొనసాగుతోంది. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే.
ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నగరంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర (Today Gold Price) రూ. 55,950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగింది. అదే 24 క్యారెట్ల విషయానికి వస్తే 10 గ్రాముల బంగారం ధర రూ. 61,040 గా ఉంది. ఇక నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ వెండి ధర (Today Silver Price) ఏకంగా రూ.1700 పెరగడంతో ధర రూ. 77,700 కి చేరింది ఉంది. ఇక హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.